అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Miss World competitions | మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy మంగళవారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ వేదికగా మే 10 నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అతిథుల కోసం ఎయిర్ పోర్టు airport, హోటళ్లు hotels, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Miss World competitions | చారిత్రక కట్టడాలను చూపెట్టాలి
తెలంగాణ telanganaలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అతిథుల ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ hyderabadలో సుందరీకరణ పనులు పూర్తి చేయాలన్నారు.