ePaper
More
    HomeతెలంగాణRTC Strike | ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కీలక వ్యాఖ్యలు

    RTC Strike | ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Strike | ఆర్టీసీ కార్మికుల (rtc employees) సమ్మెపై సీఎం రేవంత్​రెడ్డి (Cm revanth reddy) స్పందించారు. గురువారం ఆయన మే డే సందర్భంగా రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. సంస్థ మనందరిదది అని, దానిని కాపాడుకుందామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేస్తామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో సమ్మె చేస్తే సంస్థ దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. గతంలో కార్మికులు 42 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్​ kcr పట్టించుకోలేదన్నారు. కార్మికులు తమ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు.

    RTC Strike | కేసీఆర్​ కపట నాటక సూత్రధారి

    మాజీ సీఎం, బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్(KCR)​పై సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ కపట నాటక సూత్రధారి అని, విషం నింపుకొని మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పదేళ్లలో తెలంగాణ (telangana)ను కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు. 60 ఏళ్లలో రూ.72 వేల కోట్లు అప్పులు చేస్తే, కేసీఆర్ పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిందని విమర్శించారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....