HomeతెలంగాణCM Revanth Reddy | అధికారులపై సీఎం అసంతృప్తి.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

CM Revanth Reddy | అధికారులపై సీఎం అసంతృప్తి.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి సీఎంవో అధికారులు, సీఎస్​ రామకృష్ణారావుతో సమావేశం నిర్వహించారు. పలువురు అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కొందరు అధికారులపై సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల (Govt Scheme) అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రధాన కార్యదర్శి, సీఎంవో (CMO) అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, కార్యదర్శులు, ఇతర విభాగాధిపతులు నిర్లక్ష్య వైఖరిని వీడాలని సీఎం సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.

CM Revanth Reddy | రెండేళ్లు గడుస్తున్నా..

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. కొంతమంది అధికారులు పనితీరులో వెనుకబడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. వారి పని శైలిని మార్చుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను సోమరితనం వీడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉన్నతాధికారులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అధికారులు స్వయంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు.

CM Revanth Reddy | పనుల పురోగతిని సమీక్షించాలి

అన్ని శాఖల కార్యదర్శుల నుంచి క్రమం తప్పకుండా నివేదికలు తీసుకోని పనుల పురోగతిని సమీక్షించాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి సూచించారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తీసుకోవాల్సిన చర్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. కేంద్ర నిధుల (Central Funds) స్థితిపై ఆయన ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న కేంద్ర గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులను వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.