అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Errabelli Dayakar Rao | మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ మాటకారి అని, తుపాకీ వెంకట్రావులా మభ్యపెడతారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) భాగంగా శనివారం ఆయన ప్రచారం చేశారు.
జూబ్లీహిల్స్ పోరు సమీస్తుండటంతో ప్రధాన పార్టీలో ప్రచారంలో వేగం పెంచాయి. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శుక్రవారం రోడ్ షోలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha)కు మద్దతుగా శనివారం ఉదయం ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలు మానుకోవాలని హితవు పలికారు. మోసపూరిత మాటలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
Errabelli Dayakar Rao | బీజేపీతో కుమ్మక్కు
సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) ఆరోపించారు. అందుకే రేవంత్, మంత్రుల అవినీతిపై బీజేపీ మాట్లాడడం లేదన్నారు. అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు నిండా మునిగారని చెప్పారు. నగరంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
