అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో పేదల కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. పలువురు బాధితులకు రూ. 54 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అనారోగ్యంతో అప్పులపాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు (CMRF cheques) ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఒరిజినల్ బిల్స్ తీసుకుని తన కార్యాలయంలో సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తానని షబ్బీర్అలీ పేర్కొన్నారు. తానెప్పుడూ పేదలకు సహాయంగా, అండగా ఉంటానన్నారు. ప్రజల క్షేమం కోరుకుంటానన్నారు.