అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు (CMRF checks) ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ (Government Advisor Shabbir Ali) పేర్కొన్నారు.
నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం అర్బన్‌లోని 59 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 28 లక్షల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలోనీ పలు కాలనీల్లోని బాధితులకు సీఎం సహాయ నిధి (CM Relief Fund) నుంచి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్ నాయకులు పాల్గొన్నారు.