అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy MLA | సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 178 సీఎం రిలీఫ్ ఫండ్, 251 కల్యాణలక్ష్మి చెక్కులను ఆయా మండల కేంద్రాల్లో, గ్రామ రైతు వేదికలలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న ఆర్థికసాయం నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో కామారెడ్డికి వచ్చి గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలికినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం బారిన పడిన ప్రజలు డిశ్చార్జ్ తర్వాత ఆస్పత్రి ఒరిజినల్ బిల్లులు తమ కార్యాలయంలో అందజేస్తే ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చూస్తానని చెప్పారు.