అక్షరటుడే, నిజాంసాగర్, బిచ్కుంద : మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్నింట్లో అగ్రగామిగా నిలిపేందుకు ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నేతలతోపాటు మండల కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, అనీస్ పటేల్, రాము రాథోడ్, గాండ్ల రమేష్. బ్రహ్మం, రామా గౌడ్, హైమద్ చాంద్ పాషా, నాయకులు ఉన్నారు.
CMRF cheques : మద్నూర్….

మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ పటేల్, ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ముద్దవార్ కాశీనాథ్, దిండే రవి పటేల్, మనోహర్, దేవానంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.