అక్షరటుడే, బాన్సువాడ: Banswada MLA | సీఎం సహాయ నిధి చెక్కులను బాన్సువాడలో శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 69 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.26.43 లక్షల చెక్కులను అందజేశారు.
బాన్సువాడ మండలంలో (Banswada mandal) 33 మంది లబ్ధిదారులకు రూ. 10.35 లక్షలు, బీర్కూర్ మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 1.56 లక్షలు, నస్రుల్లాబాద్ మండలంలో 10 మంది లబ్దిదారులకు రూ. 3.39 లక్షలు, మోస్రా మండలం ముగ్గురికి రూ. 72 వేలు, చందూర్ మండలం నలుగురికి రూ. 1.22 లక్షలు మంజూరయ్యాయన్నారు.
వర్ని మండలం (Varni Mandal) ఐదుగురు లబ్ధిదారులకు రూ. 6.25 లక్షలు, రుద్రుర్ మండలం నలుగురు లబ్ధిదారులకు రూ. 1.44 లక్షలు, కోటగిరి మండలంలో ఇద్దరికి రూ. 46 వేలు, పోతంగల్ మండలంలోకి ముగ్గురికి రూ. 1.04 లక్షల చెక్కులను పంపిణీ (cheques distribution) చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం శ్యామల, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.