HomeతెలంగాణMLA Dhanpal Suryanarayana | సీఎంఆర్​ఎఫ్ చెక్కుల పంపిణీ

MLA Dhanpal Suryanarayana | సీఎంఆర్​ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal Suryanarayana | అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయనిధి.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను (CMRF cheques) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులు 121 మందికి రూ.35.62 లక్షల చెక్కులు అందజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారికి 15 నుంచి 20 శాతం మాత్రమే చెల్లిస్తుందన్నారు. కనీసం 50 శాతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News