అక్షరటుడే, భీమ్గల్ : CMRF Checks | సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పేదలకు ఉపశమనం దొరుకుతుందని కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని మెండోరా గ్రామంలో (Mendora Village) చెక్కులు మంజూరైన లబ్ధిదారులకు శుక్రవారం గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేష్, కాంగ్రెస్ నాయకులు కలిసి అందజేశారు.
CMRF Checks | ఆర్థికభారం తగ్గించేందుకు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. బాణావత్ సరిత, గూగులోత్ జానకి, చింతకుంట లక్ష్మి, కొట్టూరు స్ఫూర్తి తదితరులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, నాయకులు పల్లె శేఖర్, వార్డు సభ్యులు షఫీ, సంతోష్, డాక్టర్ భూమేష్, బాలరాజు, ఎల్లయ్య, నారాయణ, బాబురావ్, చాకలి గంగాధర్, పల్లికొండ నరేందర్, ఎర్రన్న, రాజన్న, దార్సింగ్ సత్యం, కంటమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.