ePaper
More
    HomeతెలంగాణCMC Hospital | IMSR ఛైర్మన్​ ఓ పెద్ద మోసగాడు : CMC డైరెక్టర్ డాక్టర్...

    CMC Hospital | IMSR ఛైర్మన్​ ఓ పెద్ద మోసగాడు : CMC డైరెక్టర్ డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఆరోపణ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: CMC Hospital : ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ అండ్​ రీసెర్చ్ IMSR ఛైర్మన్​ షణ్ముఖ మహాలింగం (IMSR Chairman Shanmukha Mahalingam) పెద్ద మోసగాడని సీఎంసీ డైరెక్టర్​ అజ్జా శ్రీనివాస్​ ఆరోపించారు. సోమవారం (ఆగస్టు 18) మీడియా సమావేశంలో మాట్లాడారు.

    నిజామాబాద్​ జిల్లాలోని సీఎంసీ హాస్పిటల్ (CMC Hospital), కళాశాల పునః ప్రారంభించడానికి (Church of South India Trust Association – CSITA) చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్​తో షణ్ముఖ మహాలింగం రూ. 100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నమ్మబలికారని పేర్కొన్నారు. తాను పెట్టుబడి పెడితే 5% షేర్ హోల్డర్​(shareholder)గా ఇవ్వడంతోపాటు డైరెక్టర్​ను చేస్తానని నమ్మించి, రూ. ఐదు కోట్ల విలువైన చెక్కులు తీసుకున్నట్లు ఆరోపించారు.

    CMC Hospital : రూ. 2.5 కోట్లు ఖర్చు చేశాను..

    ఈ మేరకు భవనాల మరమ్మతులు, హాస్పటల్ సామగ్రికి తాను రూ. 2.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు శ్రీనివాస్​ తెలిపారు. ఇక షణ్ముఖ మహాలింగం.. డాక్టర్లు, నర్సులు, సానిటైజేషన్, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్, హాస్పిటల్, కాలేజీకి కావలసిన సిబ్బందిని నియమించుకుని, మూడు నెలలు పని చేయించుకుని వారికి జీతాలు ఇవ్వకుండా మోసం చేశారని శ్రీనివాస్​ పేర్కొన్నారు.

    CMC Hospital : షణ్ముఖ మహాలింగాన్ని పట్టుకుని..

    గత నెల మెడికల్ కాలేజీ ఇన్​స్పెక్షన్​ బృందం సందర్శించిన సమయంలో షణ్ముఖ మహాలింగం కనబడకుండా పోయారని శ్రీనివాస్​ చెప్పారు. నెల రోజుల తర్వాత వచ్చిన IMSR ఛైర్మన్ షణ్ముఖ మహాలింగంను హాస్పిటల్ సిబ్బంది నిలదీసి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. షణ్ముఖ మహా లింగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

    CSITA ఒప్పందం చేసుకున్న షణ్ముఖ మహలింగం సి ఎస్ ఐ యాజమాన్యానికి ఒప్పుకున్న మొత్తాన్ని అందించక, దానితోపాటు సీఎం సి మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వక

    సీఎంసీ మెడికల్ కళాశాల ప్రతిష్ఠకు భంగం కలిగించిన షణ్ముఖ ఒప్పందాన్ని రద్దు చేస్తూ CSITA తమ అధీనంలోకి తీసుకొని సీఎంసీ సిబ్బందికి జీతాలు ఇచ్చి, డాక్టర్లను నియామకం చేసుకున్నట్లు తెలిపారు. తనను డైరెక్టర్​గా నియమించినట్లు చెప్పారు. కాగా, షణ్ముఖ మహాలింగం మీడియా సమావేశంలో తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని డాక్టర్ అజ్జ శ్రీనివాస్ పేర్కొన్నారు.

    Latest articles

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    Bajireddy Govardhan | పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బాజిరెడ్డి

    అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే...

    More like this