అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండెళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు (Prajapalana Week) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.
రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే తొలిదశ నామినేషన్ల స్వీకరణ చేపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన చేపడుతుండటం గమనార్హం. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో సీఎం పర్యటన పట్టణాలకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై (welfare schemes) ఆయన వివరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం పర్యటనతో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar district) మక్తల్‌లో సభ నిర్వహించనున్నారు. 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో, 4న ఆదిలాబాద్‌లో, 5న నర్సంపేట, 6న నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.