అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు లేటుగా హాజరై కొద్ది సేపులు సభలో ఉండి మళ్లీ వెళ్లిపోవడాన్ని గమనించిన సీఎం, ఇది రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల చర్చలకు హాని కలిగిస్తుందని తెలిపారు.గురువారం అసెంబ్లీ ప్రారంభ సమయంలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు(30 Members MLA) మాత్రమే సభలో కనిపించారు. ఈ విషయం గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే చీఫ్ వీప్ జీవీ ఆంజనేయులు(G.V. Anjaneyulu)ను కాంటాక్ట్ చేసి పరిస్థితిని తక్షణమే పరిశీలించమని ఆదేశించారు.
CM Chandra Babu | సీఎం సీరియస్
ఆంజనేయులు అసెంబ్లీ వీప్లను అప్రమత్తం చేసి, హాజరు కాని వారికి ఫోన్లు చేసి సమాధానాలు తీసుకున్నారు.ఈ చర్యల ఫలితంగా సుమారు 15 మంది ఎమ్మెల్యేలను హాజరు కోసం తిరిగి అసెంబ్లీకు ఆదేశించారు.చంద్రబాబు నాయుడు(CM Chandra Babu)అసెంబ్లీని ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అత్యుత్తమ వేదికగా భావిస్తారు. అందువల్ల ఈ సమావేశాలకు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా హాజరవుతారు.
సీఎం తన పార్టీ సభ్యులు మాత్రమే కాకుండా, ప్రతిపక్ష నేతలతో కూడా అసెంబ్లీ సమావేశాలకు(Assembly Meetings) హాజరు కావాలని సూచించారు.ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభమై, 10 రోజులు కొనసాగనున్నాయి. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.