అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రంలో గోశాలల సంరక్షణ, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేములవాడ రాజన్న(Vemulawada Rajanna)కు భక్తులు సమర్పించిన కోడెలు(Kodelu) మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో తిమ్మాపూర్ గోశాలలోని 14 కోడెలు చనిపోయాయి. ఈ క్రమంలో సీఎం సమీక్ష నిర్వహించడం గమనార్హం.
గోశాలల నిర్మాణానికి కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆయన ఆదేశించారు. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలని పేర్కొన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ(Veterinary University), కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.