ePaper
More
    HomeతెలంగాణCM Revanth | అది దెయ్యాల రాజ్య సమితి.. సీఎం రేవంత్​

    CM Revanth | అది దెయ్యాల రాజ్య సమితి.. సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | బీఆర్​ఎస్(BRS)​ పార్టీపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అది బీఆర్​ఎస్​ కాదని.. డీఆర్​ఎస్​ అని పేర్కొన్నారు. డీఆర్​ఎస్​ అంటే దెయ్యాల రాజ్య సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీలో దెయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే చెప్పారన్నారు. జవాబివ్వలేక దెయ్యాల నేత ఫాంహౌస్‌లో నిద్ర పోతున్నారని ఎద్దేవా చేశారు. కొరివి దెయ్యాలను తరిమికొట్టే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం అన్నారు.

    CM Revanth | ఫామ్​హౌస్​కు రోడ్డు కోసం..

    కేసీఆర్ (kcr)​ ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్​కు రోడ్డు కోసం వాసాలమర్రి గ్రామాన్ని నాశనం చేశారని సీఎం ఆరోపించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని చెప్పి ఇళ్లన్నీ కూలగొట్టారన్నారు. తర్వాత కేసీఆర్​ ఆ గ్రామాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఆ వాసాలమర్రిని శ్మశానం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    CM Revanth | యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తాం

    యాదగిరిగుట్ట (Yadagiri Gutta)ను అభివృద్ధి చేస్తామని రేవంత్​రెడ్డి అన్నారు. మన పూర్వికుల నుంచి ఉన్న యాదగిరిగుట్ట పేరును కేసీఆర్​ యాదాద్రిగా మార్చారన్నారు. తాము అధికారంలోకి రాగానే మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మార్చమని చెప్పారు. గుట్ట అభివృద్ధికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. గుట్టపై భక్తులు నిద్రించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురం నిర్మిస్తామన్నారు.

    CM Revanth | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

    ఎవరు అడ్డుపడ్డ.. మూసీ (Moosi) ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. మూసీని అభివృద్ధి చేసి నల్గొండ ప్రజలకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని ఆయన హామీ ఇచ్చారు.

    Latest articles

    Cloudburst | కశ్మీర్‌లో మ‌ళ్లీ క్లౌడ్ బ‌ర‌స్ట్‌.. ఆరుగురి దుర్మ‌ర‌ణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloudburst | జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కిశ్త‌వార్‌లో ఇటీవ‌లి చోటు చేసుకున్న క్లౌడ్...

    Maxwell | స‌త్తా చావ‌లేదు.. ఓడే మ్యాచ్‌ను గెలిపించిన మ్యాక్స్‌వెల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Maxwell | ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Maxwell) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన...

    Rajagopal Reddy | రాజగోపాల్​రెడ్డిపై చర్యలుంటాయా.. నేడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కొంతకాలంగా సొంత పార్టీ నేతలు,...

    Sriram Sagar | శ్రీరాంసాగర్​కు భారీ వరద.. 60 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

    అక్షరటుడే, ఆర్మూర్​ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్ (SRSP)​కు వరద పోటెత్తింది....

    More like this