అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy’s review | వరద ప్రభావంపై మెదక్ ఎస్పీ కార్యాలయం (Medak SP office) లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కలెక్టర్ (Collector), ఎస్పీ (SP), ఉన్నతాధికారులతో వరద పరిస్థితిపై సీఎం సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) దిశా నిర్దేశం చేశారు. వరద (flood) ముప్పు ఇంకా పోలేదన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
CM Revanth Reddy’s review : పంట నష్టాన్ని అంచనా వేయాలి..
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
రహదారులు తెగిన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తక్షణం రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సీఎం రేవంత్ సూచించారు.