అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ande Sri | కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలు ఘట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్నాయి. ఆయన అంతిమయాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), సీతక్క(Seethakka), పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు అభిమానులు పాల్గొన్నారు.
అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పాడె మోశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సైతం పాడె మోశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన భార్యను ఓదార్చారు.
అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. 500 మంది కళాకారులు అంత్యక్రియల్లో ఆటపాటలతో అందెశ్రీకి నివాళులు అర్పించారు.
