ePaper
More
    HomeతెలంగాణBonalu Festival | మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    Bonalu Festival | మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bonalu Festival | సికింద్రాబాద్ (Secunderabad)​లో ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahakali) అమ్మవారి భోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లష్కర్​ బోనాలతో భాగ్య నగరం అంతా సందడి నెలకొంది. ఆదివారం ఉదయం బోనాలు ప్రారంభం కాగా.. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

    బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బోనం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ తదితరులు ఉన్నారు.

    Bonalu Festival | ఆలయంలో భక్తుల రద్దీ

    లష్కర్ బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహంకాళీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అధికారులు భక్తుల కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయానికి వచ్చే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆలయంలో రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే పలహారం బండ్ల ఊరేగింపును సైతం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

    More like this

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....