అక్షరటుడే, ఇందూరు: CM Revanth Reddy | సీఎం Chief Minister రేవంత్‌రెడ్డి శుక్రవారం (అక్టోబరు 10) నిజామాబాద్‌కు రానున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
ఆమె ద్వాదశ దినకర్మను శుక్రవారం నిర్వహిస్తున్నారు. బోర్గాం(పీ)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి Nizamabad district headquarters వస్తున్నారు. కాగా, ఇది ప్రైవేటు కార్యక్రమం అయినా.. వచ్చేది ముఖ్యమంత్రి కావడంతో నిజామాబాద్ నగరం (Nizamabad city) లో ట్రాఫిక్ ఆంక్షలు traffic restrictions విధిస్తున్నారు.
CM Revanth Reddy | ఎప్పటి నుంచి అంటే..
రేపు ఉదయం 11 గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు.
మాధవనగర్ బైపాస్, కంఠేశ్వర్ బైపాస్, అర్సపల్లి, రాజరాజేంద్ర చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, రుక్మిణి ఛాంబర్, బోర్గాం(పీ) వంతెన, హోటల్ నిఖిల్ సాయి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.
నగర ప్రజలు, జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.