Homeతాజావార్తలుCM Revanth Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్​రెడ్డి

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. వరంగల్​, హుస్నాబాద్​లో ఏరియల్​ సర్వే చేపట్టనున్నారు. అనంతరం వరంగల్​లో బాధితులను సీఎం పరామర్శిస్తారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | మొంథా తుపాన్​ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లా (Warangal District)ల్లో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్​, హన్మకొండలను వరద ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

వరద నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరంగల్​లో శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు.తుపాన్​ ప్రభావంతో ఉమ్మడి వరంగల్​తో పాటు సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీంతో వరంగల్, హుస్నాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాలను ఏరియల్​ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.

CM Revanth Reddy | వరద బాధితులకు పరామర్శ

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో వరదలు ముంచెత్తడంతో వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో బాధితులు ఇళ్లలోకి వెళ్లి చూసుకుంటున్నారు. కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. ఇళ్లల్లో బురద పేరుకుపోయింది. వస్తువులు, సరుకులు కొట్టుకుపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతన నగర్​ నీట మునిగాయి. ఆయా కాలనీల్లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్‌ (Hanamkonda Collectorate)లో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

CM Revanth Reddy | ఆదుకోవాలని వేడుకోలు

ఈ ఏడాది వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కుండపోత వానలతో కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. తాజాగా వరంగల్​, హన్మకొండ, సిద్దిపేట జిల్లా (Siddipet District)ల్లో పంట నష్టం జరిగింది. గతంలో కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో పర్యటించిన సీఎం వరద సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నిధులు విడుదల కాలేదు. తాజాగా వరంగల్​లో ఆయన పర్యటించనున్నారు. ఈ క్రమంలో తమకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.