అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో (AICC Office) ఆయన అధిష్టానంతో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుడ నియామకంపై సీఎం చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పరిశీలకుల బృందం ఆయా జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకుంది. అనంతరం నివేదికను హైకమాండ్‌కు అందజేసింది.
CM Revanth Reddy | నెలాఖరులోగా..
రాష్ట్రంలో డీసీసీ అధ్యక్ష పదవులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నికలపై కూడా హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానం ఆరా తీయనున్నట్లు తెలిసింది.

