HomeతెలంగాణCM Delhi Tour | నేడు ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ

CM Delhi Tour | నేడు ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Delhi Tour | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ఆ విషయం ఎటు తేలడం లేదు. దీంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి.

సీఎం రేవంత్​రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. బిల్లు అమలుకు ఉన్న అడ్డంకులు, కేంద్రం ఆమోదం తెలుపకుంటే ఏం చేయాలని మంతనాలు సాగించనున్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court)కు సైతం వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం లభించకపోతే పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి హస్తినాకు వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం మంగళవారం బీహార్​లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన యాత్రలో పాల్గొంటారు.

CM Delhi Tour | ఓయూలో పర్యటన

ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో సీఎం రేవంత్​రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఢిల్లీ పర్యటనకు ముందు ఆయన ఓయూలో పర్యటిస్తారు. రూ.80 కోట్లతో నిర్మించిన రెండు హాస్టళ్లను ఆయన ప్రారంభించనున్నారు. రెండు హాస్టల్​ భవన నిర్మాణ పనులకు శంకుస్తాపన చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో యూనిర్సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

CM Delhi Tour | రెండు దశబ్దాల తర్వాత

ఉద్యమాల గడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రులు పర్యటించక రెండు దశాబ్దాలు అవుతోంది. 20 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో రేవంత్​రెడ్డి ఓయూలో పర్యటిస్తున్నారు. టాగూర్​ ఆడిటోరియంలో విద్యార్థులు, ప్రొఫెసర్ల సమక్షంలో ఆయన ‘విద్యారంగంలో రావాల్సిన మార్పులు– ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. కాగా తెలంగాణ ఉద్యమానికి కీలకమైన ఓయూలో బీఆర్​ఎస్​ హయాంలో కేసీఆర్​ కూడా పర్యటించలేదు. గత 20 ఏళ్లలో యూనివర్సిటీలో పర్యటించనున్న సీఎంగా రేవంత్​రెడ్డి నిలిచారు.