ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | నేడు ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth Reddy | నేడు ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. శనివారం జరగనున్న నీతిఆయోగ్‌ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్​ గాంధీ(Rahul Gandhi)లను రేవంత్​రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్​(Congress) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొంతమంది నాయకులు ఎదురు చూస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ(AICC) ఆమోదం తెలిపింది. నాలుగు మంత్రి పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, వివేక్​వెంకట స్వామితో పాటు బీసీ కోటాలో ఒకరికి, మైనారిటీ కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే అనంతరం పలువురు నేతలు అధిష్టానానికి లేఖలు రాయడం, తమకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో విస్తరణ ఆగిపోయింది.

    CM Revanth Reddy | పీసీసీ చీఫ్​ వ్యాఖ్యల నేపథ్యంలో..

    తెలంగాణ కాంగ్రెస్​ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​గౌడ్(Bomma Mahesh Kumar Goud)​ ఇటీవల నిజామాబాద్​లో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలాఖరు లేదా జూన్​లో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. పదవులు తక్కువగా ఉన్నాయని, ఆశించే వారు ఎక్కువగా ఉండటంతో సమస్య వస్తోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో చూడాలి.

    Latest articles

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారుల...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    More like this