అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. ఆ మీటింగ్లో పాల్గొనడానికి సీఎం(CM) వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని ఇటీవల ప్రధాని(Prime Minister) ప్రకటించిన విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ(CWC) మీటింగ్లో కులగణన(Caste Census)తో పాటు పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)పై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నట్లు సమాచారం.