అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 సార్లు ఢిల్లీలో పర్యటించారు. నేటి పర్యటనతో 50 సార్లు పూర్తి కానుంది. శనివారం ఏఐసీసీ న్యాయవిభాగం (AICC Legal Department) ఆధ్వర్యంలో ఢిల్లీలో (Delhi) కాంక్లేవ్‌లో నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొననున్నారు.
