ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth Reddy | ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ(Delhi) బయలుదేరారు. ఆయన వెంట రేవంత్‌ వెంట ఉత్తమ్‌ కుమార్​రెడ్డి(Uttam Kumar Reddy), శ్రీధర్‌బాబు(Sridhar Babu) సైతం హస్తీనాకు పయనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​ను అడ్డుకుంటామని సీఎం బుధవారం తెలిపిన విషయం తెలిసిందే. గోదావరి జలాలను అక్రమంగా తరలిస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరం అయితే సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆయన ఢిల్లీకి పయనం అయ్యారు.

    CM Revanth Reddy | రెండు రోజులు ఢిల్లీలోనే..

    సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) రెండు రోజులు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన టోనీ బ్లెయిర్‌ గ్లోబల్‌చేంజ్‌(Tony Blair Global Change) ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌(Banakacharla Project)పై ఆయనకు సీఎం ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై రేవంత్, ఉత్తమ్ చర్చించనున్నారు. ఏపీ సమర్పించిన PFRపై తెలంగాణ ప్రభుత్వం తరఫున వారు వివరాలు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలను కలిసి పెండింగ్‌లో ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నియామకంపై సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...