అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) రానున్నారని తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు (TU VC Professor Yadagiri Rao) తెలిపారు. వర్సిటీలో గురువారం నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెయూకు రానున్నారని పేర్కొన్నారు. ప్రాంగణంలోని సైన్స్ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
Telangana University | ఇంజినీరింగ్ కళాశాల మంజూరుపై హర్షం
తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వీసీ తెలిపారు. అలాగే పీసీసీ చీఫ్ (PCC Chief), ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ (Bomma mahesh Kumar Goud), ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అందుకు తగ్గట్లుగా మూడో ఫేజ్‌లో సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో తెయూ రిజిస్ట్రార్ యాదగిరి పాల్గొన్నారు.