అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Fund Discrimination | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) త్రిముఖ పోరు నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందన్నారు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు.
Telangana Fund Discrimination | తీవ్ర అన్యాయం
తెలంగాణ రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని సీఎం (CM Revanth Reddy) అన్నారు. దీనిపై సీఎస్‌ను వివరణ అడిగితే.. మనం రూపాయి చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వం రూ. 42 పైసలు మాత్రమే ఇస్తోందని చెప్పారన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
Telangana Fund Discrimination | వారికి అధిక నిధులు
బీహార్ రాష్ట్రం (Bihar State) కేంద్రానికి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే.. రూ.6.16 కేంద్రం తిరిగి ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. ఏ రోజైనా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా అని ప్రశ్నించారు. అయితే మనకు అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. మనం చెల్లించిన తిరిగి ఇస్తే చాలని వ్యాఖ్యానించారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో దక్షాణాది రాష్ట్రాలే 40 శాతానికి పైగా చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు.
Telangana Fund Discrimination | ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు..
తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు (ITIR project)ను రద్దు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు మంజూరైన సెమీకండక్టర్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఒత్తిడి చేసి.. ఏపీకి తరలించారని ఆరోపించారు. అసలు మున్సిపల్ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? ప్రశ్నించారు. తెలంగాణ (Telanagana) నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే.. మీరు రాష్ట్రానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.