అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌తో పాటు సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరంగల్, హన్మకొండలోని పలు కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth ) పరిశీలించారు.
సీఎం మొదట హెలికాప్టర్ ద్వారా తుపాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. హుస్నాబాద్, హన్మకొండ, వరంగల్ (Warangal) ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం హనుమకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.
CM Revanth Reddy | బాధితులతో మాట్లాడిన సీఎం
వరంగల్, హన్మకొండ (Hanmakonda)లోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. దాదాపు 45 కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ పలు కాలనీల్లో వరద అలాగే ఉంది. ఇళ్లలో బురద పేరకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి హన్మకొండలోని సమ్మయ్యనగర్‌లో వరద బాధితులతో మాట్లాడారు. హన్మకొండ చౌరస్తా, కాపువాడ, భద్రకాళి ఆలయం మీదుగా పోతననగర్‌కు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ముంపు ప్రాంతాల పరిశీలించారు. పోతన నగర్ దగ్గర ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

