అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి కడుపు మంటతో కేసీఆర్‌కు (KCR) దు:ఖం వస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గం జటప్రోల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు (Young India School) ఆయన శంకుస్థాపన చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
CM Revanth Reddy | పాలమూరుకు సున్నం పెట్టారు..
అన్నం పెట్టిన పాలమూరు జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ సున్నం పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2009లో కేసీఆర్ కరీంనగర్ (Karimnagar) నుంచి పాలమూరు వలస వచ్చి ఎంపీగా పోటీ చేశారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ను గెలిపించి ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారన్నారు. కానీ పాలామూరు జిల్లా అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్న చూపు అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నిర్వాసితులకు జీవో 98 ప్రకారం పరిహారం ఇవ్వలేదన్నారు. వాల్మీకి, బోయలను గతంలో ఎస్టీల్లో చేరుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు.
CM Revanth Reddy | ఎందుకు దు:ఖం వస్తోంది..
ప్రజాపాలన చూస్తే కేసీఆర్‌కు ఎందుకు దుఃఖం వస్తుందని సీఎం ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ తెలంగాణకు సీఎం అయినందుకు దు:ఖం వస్తుందా అన్నారు. అన్ని వర్గాల పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా స్కూళ్లు పెట్టినందుకా.. ఎస్సీ వర్గీకరణ (SC Classification) చేసినందుకు దుఃఖం వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
CM Revanth Reddy | ప్రాజెక్ట్‌లకు అడ్డుపడొద్దు
పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు రద్దు చేసి సాయం చేయాలన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 2034 వరకు పాలమూరు బిడ్డే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు.