ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. డ్రగ్స్​ నియంత్రణకు ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఈగల్‌ లోగోను ఆవిష్కరించారు. ఇకపై నార్కొటిక్‌ బ్యూరోను (Narcotics Bureau) ఈగల్‌గా పిలుస్తామన్నారు. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్‌ పట్టుకుంటుందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. డ్రగ్స్​కు వ్యతిరేకంగా శిల్పా కళావేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    తెలంగాణ (Telangana) యువత ఒకప్పుడు ఉద్యమాల్లో ముందు ఉన్నారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఎన్నో ఉద్యమాలు చేశారని, తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అయితే నేడు యువత డ్రగ్స్​కు బానిసలు (Drugs Audiction) అవుతుండటం చూసి తనకు ఎంతో బాధేస్తోందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్​కు బానిస అవుతుంటే చూస్తు ఊరుకుందామా అని ప్రశ్నించారు. డ్రగ్స్​కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్​ దందా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

    CM Revanth Reddy | స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు వార్నింగ్‌

    పాఠశాలలు, కాలేజీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. స్కూల్‌, కాలేజీలో డ్రగ్స్‌, గంజాయి దొరికితే.. యాజమాన్యంపైనా కేసులు నమోదు (Case Register) చేస్తామన్నారు. ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్లు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత యాజమాన్యాలదే అని ఆయన స్పష్టం చేశారు.

    CM Revanth Reddy | దేశాన్ని నాశనం చేయాలంటే డ్రగ్స్​ చాలు

    ప్రస్తుతం ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధాలు అవసరం లేదని సినీ హీరో విజయ్​ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. యువతకు డ్రగ్స్‌ అలవాటు అయితే ఆ దేశం నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ జీవితాల్ని నాశనం చేస్తాయన్నారు. యువత డ్రగ్స్​ వైపు వెళ్లొద్దని సూచించారు.

    CM Revanth Reddy | భయమేస్తోంది : రామ్ చరణ్​

    గతంలో పాఠశాలల బయట సోడా బండ్లు, ఐస్​ క్రీం బండ్లు ఉండేవని సినీ హీరో రామ్​ చరణ్​ (Ram Charan) అన్నారు. అప్పుడు ఐస్​క్రీం అమ్మినట్లు.. ఇప్పుడు గంజాయి అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం డ్రగ్స్​ పాఠశాలలు, కాలేజీలకు విస్తరించడంతో తనకు భయమేస్తోందని హీరో రామచరణ్​ అన్నారు. డ్రగ్స్​ పాఠశాల స్థాయికి పాకడంతో ఒక తండ్రిగా తన పిల్లల భవిష్యత్​ గురించి ఆలోచిస్తే ఆందోళనగా ఉందన్నారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉన్నతంగా ఎదగాలని సూచించారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...