HomeతెలంగాణCM Revanth Reddy | ప్ర‌భుత్వం క‌ఠినంగా క‌నిపిస్తుంది.. కానీ మీకు ఏం కావాలో చెప్పండి.....

CM Revanth Reddy | ప్ర‌భుత్వం క‌ఠినంగా క‌నిపిస్తుంది.. కానీ మీకు ఏం కావాలో చెప్పండి.. చేసి తీరుతామ‌న్న సీఎం రేవంత్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :CM Revanth Reddy | గద్ద‌ర్ అవార్డుల(Gaddar Awards) కార్య‌క్ర‌మం శ‌నివారం రాత్రి హైద‌రాబాద్ లోని హైటెక్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. దాదాపు 14 ఏళ్ల త‌ర‌వాత తెలంగాణ ప్రభుత్వం(Telangana government) నుంచి చిత్ర‌సీమ‌కు అందిన పుర‌స్కారాలు అందాయి. ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖులంతా వేడుక‌కి హాజ‌రు కావ‌డంతో ఆ ప్రాంగణం అంతా సంద‌డిగా మారింది. ఈ అవార్డ్స్‌ ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Telangana CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌, రాజమౌళి, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సుకుమార్‌, విజయ్‌ దేవరకొండతో పాటు మరికొందరు హాజరయ్యారు.

CM Revanth Reddy | నా స‌పోర్ట్ ఉంటుంది..

అవార్డులు అందించిన త‌ర్వాత రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. దాదాపుగా 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించాలని సినీ ప్రముఖులు(Movie Celebrities), దిల్ రాజు(Dil Raju) ఈ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి నేడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం(congress government) సినీ పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించడానికి అవార్డులు ఇస్తుంది. గతంలో నంది అవార్డులు ప్రకటించారు. 14 ఏళ్ల ముందు వరకు ఏ సీఎం అయినా నిర్వహించారు. వివిధ కారణాలతో ఆగిపోయిన నంది అవార్డులను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల పేరిట మీ ముందుకు వచ్చింది.

చిత్ర‌సీమ‌కు అండ‌గా నేను ఉంటా అంటూ సీఎం ప్ర‌క‌టించారు. `హాలీవుడ్, బాలీవుడ్ సైతం ఇక్క‌డ‌కు రావాలి. హైద‌రాబాద్(Hyderabad) అడ్డాగా మారాలి. అందుకు ఏం కావాలో అడ‌గండి.. నేను చేస్తా అంటూ టాలీవుడ్ కు మాట ఇచ్చారు రేవంత్‌. రాష్ట్ర ప్ర‌భుత్వం కొన్ని క‌ఠినమైన నిర్ణ‌యాలు తీసుకున్నా, అది చిత్ర‌సీమ‌పై ప్రేమ‌తోనే అని, గ‌తంలో జ‌రిగిన‌వి మ‌ర్చిపోవాల‌ని, క‌ల‌సిక‌ట్టుగా ప‌ని చేయాల‌ని హిత‌వు ప‌లికారు. గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్‌ అని చర్చించుకునేవారని, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవారని అన్నారు. కానీ, ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అంటున్నారని తెలిపారు. విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్నవారు సినీ పరిశ్రమలో రాణిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ, వెంకట్‌, అశ్వనీదత్‌ అమ్మాయిలు, అల్లుడు నాగ్‌ అశ్విన్‌.. వీళ్లందరూ కాలేజ్‌ డేస్‌లో నాకు తెలుసు. వారందరూ రాణిస్తుండడం పట్ల అభినందిస్తున్నాను అని రేవంత్‌ అన్నారు.