CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ Harvard Kennedy School ఏఐ పాలసీ సింపోజియం AI ​​Policy Symposium లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు భారత్ నుంచి ఒక్క తెలంగాణ సీఎంకే ఆహ్వానం అందడం ప్రాధాన్యం […]

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ Harvard Kennedy School ఏఐ పాలసీ సింపోజియం AI ​​Policy Symposium లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు భారత్ నుంచి ఒక్క తెలంగాణ సీఎంకే ఆహ్వానం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది.

CM Revanth Reddy | మార్చి 27న సింపోజియం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ Harvard University campus లో వచ్చే మార్చి 27వ తేదీన సింపోజియం జరగనుంది. సర్కారు, పరిశ్రమలు, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ దిశపై చర్చించడమే ఈ సింపోజియం ప్రధాన లక్ష్యం.

“AI as Infrastructure and Compute Power: Impact on Livability and Workforce” అనే అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్యానెల్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

ఈ సదస్సులో ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్, డేటా సెంటర్లు, హైపర్‌స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలపై ప్రభావం అనేదానిపై చర్చ ఉంటుంది. ప్రపంచం అంతటా ఏఐను కేవలం సాంకేతికంగా కాకుండా.. కీలక మౌలిక సదుపాయంగా పరిగణిస్తున్న తరుణంలో తెలంగాణ దృష్టికోణం అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించే అవకాశం లభించింది.

ప్రతిపాదిత ఏఐ సిటీ రూపకల్పన, డేటా సెంటర్ పాలసీలు, ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వినియోగం, కంప్యూట్ సామర్థ్యాల ఏర్పాటుకు తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించనున్నారు.

నిరంతర విద్యుత్తు సరఫరా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, భూమి కేటాయింపులు, స్టార్టప్ ప్రోత్సాహకాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ వాతావరణం వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. తెలంగాణను డేటా హబ్‌గా ఎంచుకునేలా గ్లోబల్ టెక్ కంపెనీలు రూపొందించిన విధానాలను సైతం వివరించే అవకాశం ఉంది.

Related articles

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.