అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (Harvard Business School) విద్యార్థులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు. భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు.ముఖ్యమంత్రి ఇటీవల దావోస్ పర్యటన ముగించుకొని అమెరికా (America) వెళ్లిన విషయం తెలిసిందే.
ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో చేరారు. విద్యార్థిగా మారి తరగతులు వింటున్నారు. ఈ నెల 30 వరకు సీఎం తరగతులకు హాజరు అవుతారు. ఈ క్రమంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) లోని భారతీయ విద్యార్థుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యూనివర్సిటీ క్యాంపస్ (University Campus)లోని తమ పాఠశాలను సందర్శించమని ఆహ్వానించింది.
CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు..
బిజీ షెడ్యూల్లో సైతం సీఎం అన్ని తరగతులు, అసైన్మెంట్లను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులను ఆహ్వానించి వారితో సంభాషించారు. HBS విద్యార్థుల కెరీర్ మార్గాలు, సవాళ్లను అర్థం చేసుకోవడంతో పాటు, సీఎం రేవంత్ తన విజయ మంత్రాన్ని వారితో పంచుకున్నారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) ముఖ్య లక్షణాలను వివరిస్తూ, భారతదేశ వృద్ధిలో సహాయపడటానికి వారి నెట్వర్క్లు, ప్రతిభను ఉపయోగించాలని రేవంత్ రెడ్డి వారిని కోరారు.కాగా హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్సు పూర్తయిన తర్వాత సీఎం సర్టిఫికెట్ తీసుకొని హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. ఫిబ్రవరి 2న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అనుభవజ్ఞులైన నాయకుల కోసం హార్వర్డ్ కెనెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కోర్సును రూపొందించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలి, అనిశ్చిత పరిస్థితులు, మార్పులు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఇందులో నేర్పిస్తారు.