అక్షరటుడే, వెబ్డెస్క్: Mamnoor Airport Development | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు (Minister Rammohan Nayudu)ను కలిశారు. తెలంగాణలోని కీలక విమానాశ్రయ ప్రాజెక్టులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడానికి సీఎం రేవంత్రెడ్డి పౌర విమానయాన మంత్రిని కలిశారు. మామునూర్ విమానాశ్రయానికి (Mamunur Airport) భూసేకరణ పూర్తయిందని కేంద్ర మంత్రికి తెలిపారు. అవసరమైన అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయానికి (Kothagudem Airport) సంబంధించి, పాల్వంచ వద్ద తగిన భూమిని గుర్తించామని పేర్కొన్నారు. ఓఎల్ఎస్ సర్వే చేసి, సాధ్యాసాధ్య అధ్యయనాన్ని నిర్వహించాలని కోరారు.
Mamnoor Airport Development | అనుమతులు ఇవ్వాలి
అంతర్గాం విమానాశ్రయ ప్రాజెక్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించామని రేవంత్రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్టుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు (Adilabad Airport)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 249.82 ఎకరాల భూమి బదిలీకి సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణ ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని, పర్యాటక రంగాన్ని పెంచుతుందన్నారు.