అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వం Telangana government లో మరో మంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ Jubilee Hills లో జరిగిన సినీ కార్మికుల అభినందన సభ ఈ తాజా వివాదానికి కారణంగా మారింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన సినీ కార్మికుల అభినందన సభ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy హాజరై సినీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
అయితే, ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆ సమయంలో తన శాఖ పనులతో ముంబైలో ఉన్నారని తెలుస్తోంది.
అయితే తాను లేని సమయంలో సభ నిర్వహించడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
సినీ కార్మికుల సమ్మె సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన కాగా, ఈ అభినందన సభకి తనకు ఆహ్వానం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
CM Revanth Reddy | నా శాఖను హైజాక్ చేస్తున్నారు..
అయితే కోమటిరెడ్డి Komatireddy venkat Reddy అసంతృప్తి సీఎంపై కాదని, తన శాఖ వ్యవహారాలను సీఎం సన్నిహితుల్లో ఒకరు హైజాక్ చేస్తున్నారనే భావనతో ఉన్నారని సమాచారం.
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలను ఆ నేత నేరుగా సీఎంతో సమన్వయం చేసుకుంటున్నారని, ఈ క్రమంలో కోమటిరెడ్డిని పక్కకు పెడుతున్నారనే చర్చ కొనసాగుతోంది.
మరోవైపు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కూడా ఆ వ్యక్తితో కలిసి సినిమా రంగ వ్యవహారాలు చూసుకుంటున్నారని కోమటిరెడ్డి తన సన్నిహితుల దగ్గర ముచ్చటించినట్టు టాక్ వినిపిస్తుంది.
ఇక ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాయి. “కోమటిరెడ్డికి సభ గురించి ముందుగానే సమాచారం ఉంది. ఆయనకు ఎలాంటి అసంతృప్తి లేదు. ముంబైలో ముందే నిర్ణయించిన సమావేశాల కారణంగానే హాజరు కాలేకపోయారు అని వివరణ ఇచ్చాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సినీ కార్మికుల ఓట్లు కీలకమైనవిగా మారిన నేపథ్యంలో, కేవలం మూడు రోజుల్లోనే ఈ అభినందన సభను ఏర్పాటు చేసినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు మంత్రులకు అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి.
కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి మంత్రులతో విభేదాలు ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా ఆ జాబితాలో చేరడంతో కాంగ్రెస్‌లో Congress మరోసారి కలకలం రేగింది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం “సభా ఆహ్వానం” అంశమే కాకుండా, రేవంత్ క్యాంప్, ఇతర మంత్రుల మధ్య పెరుగుతున్న దూరం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

