ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCM Revanth Reddy | ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth Reddy | ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | ‘‘రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లను మీకు మంజూరు చేసి కట్టిస్తా’’ అని అప్పటి పీసీసీ చీఫ్​.. ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 2023 మార్చ్ 18న కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో పాదయాత్రలో భాగంగా పీసీసీ చీఫ్(PCC Chief) హోదాలో ఇళ్లు కూలిపోయిన బాధిత మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. ప్రభుత్వ సలహాదారు సమక్షంలో గురువారం శంకుస్థాపన చేశారు.

    CM Revanth Reddy | పాదయాత్రలో హామీ

    ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన హాథ్​ సే హాథ్​ జోడో యాత్ర(Haath se haath jodo yatra)లో భాగంగా 2023 మార్చిలో చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా రాజంపేట వెళ్లారు. ఆ సమయంలో వర్షానికి తమ ఇళ్లు కూలిపోయాయని, ఆదుకోవాలని గ్రామానికి చెందిన భిక్కనూరు లక్ష్మి, చిట్యాల రాజమణి మొరపెట్టుకున్నారు. దాంతో స్పందించిన రేవంత్ రెడ్డి(Revanth Redy) త్వరలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేసి కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం గురువారం ఇరువురితో పాటు మరొక మహిళ భిక్కనూరు రేఖకు కూడా ఇల్లు మంజూరు ఇవ్వాలని కోరగా ముగ్గురికి ఇళ్లను మంజూరు చేశారు. ముగ్గుపోసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

    CM Revanth Reddy | ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..

    ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

    ఇళ్లు కోల్పోయిన బాధితులకు జోడో యాత్రలో భాగంగా అప్పటి పీసీసీ చీఫ్​, ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం 28 జనవరి 2025 నాడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇద్దరికి ఇళ్లు మంజూరయ్యాయి. కోడ్ రావడంతో అప్పుడు ప్రారంభించలేకపోయాం. ప్రస్తుతం శంకుస్థాపన చేశాం రెండు మూడు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సీఎం(CM)ను స్వయంగా ఆహ్వానిస్తాను. వీలు కాకపోతే వర్చువల్​గా అయినా ఇళ్లను సీఎంతోనే ప్రారంభించేలా చూస్తాను. నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరయ్యాయి. 3028 మంది ఎంపిక పూర్తయింది. మిగతా 472 మంది లబ్దిదారులను త్వరలోనే ఎంపిక చేస్తారు.


    జీవితాంతం రుణపడి ఉంటాం

    – లబ్ధిదారులు లక్ష్మీ, రేఖ, రాజమణి

    మా గ్రామం నుంచి పాదయాత్ర చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూలిన మా ఇళ్లను పరిశీలించారు. మా బాధను స్వయంగా చూసి ఆరోజు చలించిపోయారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇళ్నుల మంజూరు చేసి హామీ నిలబెట్టుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.

    More like this

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...