ePaper
More
    HomeతెలంగాణBanakacharla | సీఎం రేవంత్​రెడ్డికి బేసిక్స్​ తెలియవు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    Banakacharla | సీఎం రేవంత్​రెడ్డికి బేసిక్స్​ తెలియవు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Banakacharla | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy) ప్రాజెక్ట్​ల విషయంలో బేసిక్స్​ తెలియవని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)​పై గురువారం ఆయన తెలంగాణ భవన్ (Telangana Bhavan)​లో మీడియాతో మాట్లాడారు.

    సీఎం రేవంత్​రెడ్డికి బేసిన్లు తెలియవు.. బేసిక్స్​ తెలియవు అని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్ట్​ (Devadula Project) ఏ బేసిన్​లో ఉందో కూడా సీఎంకు తెల్వదన్నారు. బనకచర్లపై రేవంత్ అసత్యాలు చెప్పారన్నారు.  ఆంధ్రా జల దోపిడీని అడ్డుకోమంటే తమపై విమర్శలు చేస్తున్నారని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Banakacharla | కలిసి అడ్డుకుందాం

    ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​ను అందరం కలిసి అడ్డుకుందామని ఆయన సూచించారు. బీఆర్ఎస్ తరఫున బనకచర్ల ఆపడానికి సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మద్దతిస్తామన్నారు.

    Banakacharla | కేసీఆర్​ 1900 టీఎంసీలు అడిగారు

    కేసీఆర్​ గోదావరిలో (Godavari) 1,900 టీఎంసీలు కావాలని అడిగినట్లు హరీశ్​రావు చెప్పారు. కానీ, సీఎం రేవంత్​ 1000 టీఎంసీలు చాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు  గోదావరిలో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని, మరో 20 టీఎంసీలు సూత్రప్రాయంగా ఆమోదించిందని చెప్పారు. రేవంత్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జీవితం అంతా నీటి కోసం పోరాడారు అని హరీశ్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ముందు 750 టీఎంసీల నీరు రావాలని పోరాడామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిన పాపంతో కృష్ణాలో 220 టీఎంసీలే తెలంగాణకు వచ్చాయని ఆయన చెప్పారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...