అక్షరటుడే, వెబ్డెస్క్: President Murmu | భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము (President Smt. Droupadi Murmu) హైదరాబాద్లో శీతాకాల విశ్రాంతి పూర్తి చేసుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయం (Rashtrapati Nilayam) (బొల్లారం)లో బస చేశారు. సోమవారం ఉదయం హకీంపేట్ వాయుసేన స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఆదివారం నాడు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అతిథులతో సంభాషించారు. ఈ శీతాకాల విశ్రాంతి కాలంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి సంబంధిత అంశాలపై కూడా దృష్టి సారించారు.