CM Revanth Reddy | ఆపరేషన్​ సిందూర్​.. సీఎం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఆపరేషన్​ సిందూర్​తో భారత్​–పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ పేరిట పీవోకే, పాక్​లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ సిందూర్​, హైదరాబాద్​లో మాక్​ డ్రిల్​పై బుధవారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్‌లో హైలెవల్ కమిటీ భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఆపరేషన్​ సిందూర్​తో భారత్​–పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ పేరిట పీవోకే, పాక్​లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ సిందూర్​, హైదరాబాద్​లో మాక్​ డ్రిల్​పై బుధవారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్‌లో హైలెవల్ కమిటీ భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

CM Revanth Reddy | సమన్వయంతో పని చేయాలి

ఒకవేళ భారత్​పై పాక్​ ప్రతిదాడి చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆఏశించారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్​లోని విదేశీ రాయబర కార్యాలయాలు, రక్షణశాఖ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో సెలవులు రద్దు చేశారు.

వైద్యం, పౌర సరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Related articles

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...