అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth | సరస్వతి నది (Saraswati River) పుష్కరాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొగుట పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామిజీ తెల్లవారు జామును పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి (CM revanth reddy) గురువారం సాయంత్రం కాళేశ్వరం (kaleshwaram) వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో గదుల సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు (statue of goddess saraswati unveiled). కాగా.. సరస్వతి పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
