అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ట్యాంక్‌బండ్ వద్ద వేలాది గణపతి విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు.
శోభాయాత్రగా తరలివచ్చిన గణనాథుడి ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. భక్తుల నినాదాలతో ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మాత్తుగా ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి షెడ్యూల్ లేకున్నా.. ఆయన ఆకస్మత్తుగా ట్యాంక్‌బండ్ (Tank Bund) వద్దకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్దగా సెక్యూరిటీ లేకుండా, పరిమిత వాహనాలతో సాదాసీదాగా ఆయన అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ క్రేన్ నెంబర్ 4, 5, 6 వద్ద నిమజ్జన కార్యకలాపాలను పరిశీలించి, భక్తులతో మాట్లాడారు.
CM Revanth Reddy | సిబ్బందికి అభినందన
“నిమజ్జనాలను తిలకించిన భక్తులు, సందర్శకులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి. పోలీసుల సూచనలను అనుసరించి శాంతియుతంగా ఈ పండుగను ముగించుకుందాం,” అని సీఎం విజ్ఞప్తి చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరిచందన్ (Collector Harichandan) సీఎంకు సమగ్ర వివరాలను ఇచ్చారు. అనంతరం నిమజ్జన విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని ఆయన అభినందించారు. పండుగ పూర్తయ్యే వరకు ఇదే ఉత్సాహంతో సేవలు అందించాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ పోలీసులు, మునిసిపల్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టి శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
CM Revanth Reddy | పోలీసులకు సహకరించాలి
నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు పోలీసులకు సహకరించాలని సీఎం సూచించారు. ట్రాఫిక్, భద్రతా చర్యలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Sudden Visit.. Surprise Visit
Simple CM Saab @revanth_anumula #RevanthReddy #GaneshNimajjanam2025 https://t.co/yNQra8bWS0 pic.twitter.com/KTYVfIYaqh
— NewsWala (@NewsWalaTelugu) September 6, 2025