అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. బేగంపేట్ (Begumpet) నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఏదులాపురం చేరుకున్నారు.
ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం చేయనున్నారు. నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజీ (JNTU college) , కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ఖమ్మం బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
ఖమ్మం జిల్లా పర్యటన (Khammam district tour) అనంతరం సాయంత్రం 4.30 గంటలకు సీఎం హెలికాప్టర్లో ములుగు జిల్లా మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మేడారం హరిత హోటల్లో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరగనుంది. 6.30 గంటలకు మేడారంలో అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హరిత వై జంక్షన్, జంపన్న వాగు స్తూపం వరకు, మేడారం ఆర్టీసీ బస్ స్టాండ్‌ను సందర్శిస్తారు.