అక్షరటుడే, హైదరాబాద్: compassionate appointment : కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Chief Minister A. Revanth Reddy) నెరవేర్చారు. హోం శాఖ(Home Department)లో జూనియర్ అసిస్టెంట్‌గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు.
వరంగల్(Warangal)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ (Head Constable) బి.భీమ్ సింగ్ సర్వీస్‌లో ఉండగా 24 సెప్టెంబరు, 1996న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బి.రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ.. గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. రాజశ్రీ అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఝప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
రాజశ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు(Vardhannapet MLA Nagaraju).. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులకు సూచించారు. దీంతో హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నాగరాజుతో వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.