అక్షర టుడే, గాంధారి: Gandhari mandal | మండలకేంద్రంలో ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్ (AMC chairman parmeshwer) చేతుల మీదుగా ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు (CM Relief Fund Cheques) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA madan mohan rao) ఆదేశాల మేరకు చెక్కులు అందించినట్లు పేర్కొన్నారు. సీతాయిపల్లికి చెందిన నారాయణకు రూ.56వేలు, బాన్సువాడ సిద్దుకు రూ.60వేలు, శాంతవ్వకు రూ.21,500, నాగభూషణం రూ.17వేల చెక్కు అందించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజమల్లు, సాయిబాబా, నారాయణ, పెద్ద మల్లయ్య, కాశీరాం పాల్గొన్నారు.