అక్షరటుడే, ఎల్లారెడ్డి : CM Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి (CM Revanth) గురువారం జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట (Begumpet) నుంచి హెలిక్యాప్టర్లో బయలు దేరాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన గంట ఆలస్యం అయింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బేగంపేట నుంచి బయలు దేరారు. లింగంపేట (Lingampet) మండలం మోతెలో ఆయన హెలీక్యాప్టర్ ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ధ్వంసమైన పంటలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
CM Revanth Reddy | పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు
సీఎం పర్యటన నేపథ్యంలో లింగంపేట మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి వైపు వాహనాలను అనుమతించడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంట ముందు నుంచే వాహనాలు ఆపేయడంతో.. కామారెడ్డిలో పని నిమిత్తం బయలు దేరిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.