అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool district) మన్ననూరు ఐటీడీఏ(ITDA) పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ ఇందిర సౌర గిరి జల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. రైతులకు 5, 7.5 హెచ్‌పీ పంపుసెట్లు ఇస్తామని పేర్కొన్నారు. విద్యుత్ పంపుసెట్ల స్థానంలో వీటిని బిగిస్తారని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలో వంద రోజుల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సౌర విద్యుదుత్పత్తితో గిరిజనులు ఆదాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
