అక్షరటుడే, ఎల్లారెడ్డి : CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) కామారెడ్డి, మెదక్ జిల్లాలు (Kamareddy and medak Districts) అతలాకుతలం అయ్యాయి. జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డిలలో వర్షం బీభత్సం సృష్టించింది.
రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Reavanth Reddy) హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేశారు. వర్షధాటికి చాలా చోట్ల చెరువులు తెగిపోయాయి. అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. దీంతో అధికార యంత్రాంగం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
CM Revanth Reddy | సీఎం ఏరియల్ సర్వే..
రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి జిల్లాలో వరద కారణంగా అపారమైన నష్టం వాటిల్లింది. దీంతో సీఎం ప్రత్యక్షంగా ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఏరియల్ సర్వే (aerial survey) నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయలుదేరారు. మెదక్‌తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌లో ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్ నుంచే వీక్షించారు. అలాగే పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం మెదక్‌కు వెళ్లారు. అక్కడి లోని కలెక్టరేట్లో భారీవర్షాలపై సమీక్ష చేయనున్నారు.