అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలోని పంచాయతీలకు సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు.
రాష్ట్రంలో ఇటీవల కొత్త పంచాయతీ పాలకవర్గాలు (panchayat governing bodies) కొలువుదీరాయి. 22 నెలలుగా పంచాయతీల్లో సర్పంచులు లేక అనేక సమస్యలు పేరుకుపోయాయి. మరోవైపు నిధుల కొరత వేధిస్తోంది. దీంతో కొత్తగా వచ్చిన సర్పంచులు పనులు చేపట్టడానికి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వారికి శుభవార్త చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు (village panchayats) రూ.10 లక్షల చొప్పున, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌గా నిధులు ఇందజేస్తామని చెప్పారు.
CM Revanth Reddy | అదనంగా నిధులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు ఈ నిధులు అదనమని సీఎం స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ఈ ప్రత్యేక నిధులను అందజేస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ సర్పంచులకు ప్రజల్లో గౌరవం, మర్యాద పెరుగుతాయన్నారు. గ్రామ సభలు పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
CM Revanth Reddy | అండగా ఉంటాం
ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మార్చి 31లోపు గ్రామ పంచాయతీలకు రావలసిన రూ.౩ వేల కోట్లను తెప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీలు పంథాలు ఎన్నికల సమయంలోనే అన్నారు. ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే అని, ఎవరి పట్ల వివక్ష చూపొద్దని సర్పంచులకు సీఎం సూచించారు.
CM Revanth Reddy | ప్రభుత్వ బడుల్లో టిఫిన్
చదువు ఒక్కటే పేదల జీవితాలను మార్చగలదని సీఎం అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమం చేపడుతామని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలు కల్పించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పారు.